KTR: ప్రజల పైన భారాన్ని మోపడం దారుణం.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైర్

by Ramesh Goud |   ( Updated:2024-10-21 09:58:08.0  )
KTR: ప్రజల పైన భారాన్ని మోపడం దారుణం.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల పైన విద్యుత్ భారాన్ని మోపడం దారుణమని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు విద్యుత్ నియంత్రణ మండలికి విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లతో 18,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైందని, గృహ వినియోగదారులకు సైతం స్థిర చార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలకు ఒకటే రేటు నిర్ణయించాలనే ప్రయత్నం చేస్తున్నదని, ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపాలని కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. గతంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల పైన విద్యుత్ చార్జీల భారాన్ని వేయలేదని, కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాలకు ఉచిత విద్యుత్ అని అధికారంలోకి వచ్చి, ఉన్న విద్యుత్‌ని ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed