- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదలకు హాజరుకాని కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో హాట్ టాపిక్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఏడాది పాలన-ఎడతెగని వంచన అంటూ కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ పార్టీ (BRS charge sheet) చార్జ్ షీట్ విడుదల చేసింది. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన ప్రజలకు వేదనను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ, హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని మండిపడ్డారు. ఖమ్మంలో వరదలు వస్తే ఒక హెలికాప్టర్ పెట్టలేని చేతకాని దద్దమ్మలు ముగ్గురు మంత్రులు అంటూ ఫైర్ అయ్యారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలం అయిందని, చట్టం గాంధీ భవన్ నుంచి నడుస్తోందని ఆరోపించారు. రేవంత్ పాలనలో తొమ్మిది చోట్ల మత కలహాలు జరిగాయన్నారు. సంక్షేమాన్ని సర్వ నాశనం చేసిన చరిత్ర రేవంత్ ప్రభుత్వానిదన్నారు.
కేసీఆర్ ఇరిగేషన్.. రేవంత్ పాలనలో ఇరిటేషన్
పాలమూరు బిడ్డనని రెచ్చిపోయే రేవంత్ రెడ్డి.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తట్టెడు మట్టి ఎత్తినవా? అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగింది రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ పాలనలో వ్యవసాయానికి గ్రహణం పట్టిందన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేశామని డబ్బా కొట్టుకుంటున్నారని, హామీలు అమలు చేయలేక రేవంత్ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడన్నారు. రైతు బంధును ఎగ్గొట్టారని, బోనస్‌ను బోగస్ చేశారన్నారు. ఉద్యోగులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదలకు హాజరుకాని కేటీఆర్
బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకాలేదు. దీంతో తెలంగాణ భవన్‌లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఏడాది పాలనపై హరీశ్‌రావు ఆధ్వర్యంలో చార్జ్ షీట్ విడుదల చేశారు. అయితే, హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనకపోవడం గమనార్హం. కేటీఆర్ ఎందుకు పాల్గొనలేదు.. అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కేటీఆర్ కీలక కార్యక్రమానికి లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.