- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరికి కేటీఆర్ లీగల్ నోటీసులు
దిశ, డైనమిక్ బ్యూరో:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై చేసిన ఆరోణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ యాక్షన్ లోకి దిగారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్టకు భంగం కలించేలా ప్రకటనలు చేసినందున క్షమాపణలు చెప్పాలని లేకుంటే లీగల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పీవీ జనని అండ్ అసోసియేషన్ పేరుతో మార్చి 2వ తేదీతో లీగల్ నోటీసులు పంపించారు. కాగా తనపై నిరాధారమైన, మతిలేని ఆరోపణలు చేస్తున్నారని ఈ ఆరోపణలపై కోర్టుకు వెళ్తానంటూ నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ అంతా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బదులిచ్చారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణలో తేలితే తప్పనిసరిగా శిక్షకు అర్హులేనన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ పరువు నష్టం దావా వేయడంతో దీనిపై మంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.