- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: హైడ్రా దెబ్బకు కలగానే సొంతింటి కల.. మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా(Hydra) దెబ్బకు సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని, కొత్తవి కొనాలన్నా.. పాతవి అమ్మాలన్నా భయంగానే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTRBRS) అన్నారు. రిజిస్ట్రేషన్ల(Registrations)పై రాబడి తగ్గుతోందని వస్తున్న వార్తలపై ట్విట్టర్ స్పందించిన కేటీఆర్.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. సంపద పెంచే ఆలోచనలు మావి, ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి అంటూ.. మేము బంగారు బాతును చేతిలో పెడితే, మీరు పదినెలలకే చిప్ప చేతిలో పెట్టారని ఆరోపణలు చేశారు.
అలాగే మీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న, పాతవి అమ్మాలన్న భయంగానే ఉందని, హైడ్రా దెబ్బకు హైద్రాబాద్(HYD)లో సొంతింటి కలలు కలగానే మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు. మీ మూసి(Moosi) ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులా అయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కాసుల పై మీ కక్కుర్తి నిర్ణయాలు.. రాష్ట్రాని అధోగతిపాలు చేశాయని, నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, నేడు విలవిలలాడుతూ బోసిపోయాయని అన్నారు. మీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమేనని, బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న నీ దౌర్బాగ్యపు పాలనకు ఏప్రిల్ నుండి అక్టోబర్ లెక్కలే సాక్షాలు అని కేటీఆర్ విమర్శించారు.