- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: ఇది కక్షా? ఇది శిక్షా? ఇది నిర్లక్ష్యమా? ఎక్స్‌లో కేటీఆర్ సూటి ప్రశ్నలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఇది కక్షా? ఇది శిక్షా? ఇది నిర్లక్ష్యమా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో (Gurukulas) గురుకుల పాఠశాలల పరిస్థితిపై సోమవారం ఎక్స్ వేదికగా (KTR) ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయింది? గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? మండలానికి ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా? అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా? ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రతిష్టాత్మకంగా సీఎం నుంచి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించింది ఆరంభ శూరత్వమేనా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శమని, నేడు అంతులేని నిర్లక్ష్యమని విమర్శించారు. విద్యార్థులు గురుకులాల నుంచి పారిపోయే పరిస్థితికి కారణం ఎవరని నిలదీశారు.