KTR Clarity On Early Elections: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-25 07:19:46.0  )
KTR Clarity On Early Elections: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
X

KTR Clarity On Early Elections

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచి పాలన కొనసాగించింది. రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిచినా..వచ్చే ఎన్నికల్లో హోరాహోరీగా పోటీ సాగనుంది. దీంతో ముందస్తు ఎన్నికలు పెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించినా..వాటిపై క్లారిటీ దొరకలేదు. ఎన్నికలపై క్లారిటీ ఇస్తూ మంత్రి కేటీఆర్ 2023లో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందని తెలిపారు. గోల్మాల్ గుజరాత్ మోడల్‌ను బహిర్గతం చేస్తామని, బంగారు తెలంగాణ మోడల్‌ను భారతదేశానికి చెబుతామని కేటీఆర్ చెప్పారు' అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్ లో టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశానరు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.

Advertisement
Next Story

Most Viewed