- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : అధికారులారా.. మేం అధికారంలోకి వస్తే ఏపీలాగా అదే జరుగుతుంది? : కేటీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసులు, ఐపీఎస్ అధికారులారా ఇంత స్వామి భక్తి వద్దని, మళ్లీ నాలుగేళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని (KTR) కేటీఆర్ అన్నారు. గురువారం (Telangana Bhavan) తెలంగాణ భవన్ వద్ద పలువురు లగచర్ల గ్రామస్తులు కేటీఆర్‌ను కలిసి వారి సమస్యలు తెలియజేశారు. అనంతరం కేటీఆర్ మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. తప్పు చేసిన అధికారుల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో అదే జరుగుతుందని సూచించారు. లగచర్ల లో జరిగిన ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందని ఆరోపించారు. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరని ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారని, కానీ అదంతా బాక్వాస్ అని పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాశారని వెల్లడించారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లినట్లు వెళ్లారని ఫైర్ అయ్యారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టమొచ్చినట్లు కొట్టారని మండిపడ్డారు. ఒక అమ్మాయి ఛాతి మీద కాలు పెట్టి ఆమె భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంత పిచ్చోడు మరొకరు ఉండరని, జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ఇంతటితో నేను వదిలిపెట్టనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల, మహిళా కమిషన్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తానని అన్నారు. ఫార్మా సిటీ ని కేసీఆర్ మంచి ఉద్దేశంతో ముచ్చర్లలో పెట్టారని, అందుకోసం చైనాకు వెళ్లి అక్కడ 70 వేల ఎకరాల్లో ఉన్న తయారీ పరిశ్రమను పరిశీలించి వచ్చారని గుర్తుకు చేశారు. ఫార్మాసిటీ కోసం 8 ఏళ్లు కష్టపడ్డామని, 14 వేల ఎకరాల భూమి సేకరించామని స్పష్టం చేశారు. కొడంగల్ లో భూముల సేకరణకే ఇంత గొడవ జరిగితే ముచ్చర్లలో ఎంతో విలువైన భూములు ఉన్నాయని, వాటిని సేకరించే విషయంలో ఇంకా ఎంత గొడవ జరగాలి? అని ప్రశ్నించారు. కానీ మేము రైతులను ఒప్పించి వారికి నచ్చచెప్పి భూసేకరణ చేశామని వివరించారు.
ఈ ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు.. ఇప్పుడు ఆయన ప్రతిపాదిస్తున్న ఫార్మా విలేజ్ లకు పర్మిషన్ రావటానికి కూడా ఏడాది కి పైగా సమయం పడుతుందని వెల్లడించారు. ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ అంటూ రేవంత్ రెడ్డి మాటలు చెబుతున్నాడని, కానీ అది జరగడం సాధ్యం కాదన్నారు. నేను గతంలో పరిశ్రమల మంత్రిగా చేసిన అనుభవంతో చెబుతున్న ఓ ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కు పరిశ్రమలను తరలించటం అనేది అంత సులువైన పని కాదన్నారు. ఫార్మా విలేజ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
ఫార్మా సిటీ వస్తే కాలుష్యం అవుతుందని మీరే కదా గతంలో ప్రజల మనసులో విషం నింపారని అన్నారు. ఇప్పుడు కొడంగల్‌లో ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? ప్రజలు కూడా ఇదే విషయాన్ని అడుగుతున్నారని తెలిపారు. లగచర్లలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడిందన్నారు. దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని, దాడి చేశారంటూ దాదాపు 50 మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించాడని ఆరోపించారు. ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లను కొట్టి మిగతా పార్టీ వాళ్లను వదిలేశారని, సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చన్నారు. సురేశ్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే.. ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశాడని అంటున్నారు. కానీ సురేశ్‌కు భూమి ఉంది. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు.