కృష్ణా జలాల వివాదం.. ఏపీకి ఝలక్ ఇచ్చిన ట్రైబ్యునల్

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-08 15:37:40.0  )
కృష్ణా జలాల వివాదం.. ఏపీకి ఝలక్ ఇచ్చిన ట్రైబ్యునల్
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలుకు ఏపీ సర్కారు గడువు కోరింది. కాగా ఏపీ విజ్ఞప్తిని కృష్ణా ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. జూన్ వరకు సమయం ఇవ్వాలన్న ఏపీ విజ్ఞప్తిని కృష్ణఆ ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. కృష్ణా జలాల వివాదంలో పూర్తి వివరణ కోసం ఏపీ గడువు కోరింది. వివరణ సమర్పణకు గడువు కోరుతూ ఏపీ ప్రభుత్వం అప్లికేషన్ పెట్టుకుంది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా జూన్ వరకు ఏపీ గడువు కోరగా.. ఏపీ రిక్వెస్ట్ పై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. పెండింగ్ కేసులకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని తెలంగాణ తెలిపింది. కాలయాపన కోసమే ఏపీ గడువు కోరుతుందని తెలంగాణ తెలిపింది. దీంతో జూన్ వరకు గడువు ఇవ్వడం సాధ్యం కాదని ట్రైబ్యునల్ తెలిపింది. ఈ నెల 9లోపే వివరణ దాఖలు చేయాలని ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలకు ఆదేశించింది. విచారణను మే 15కు కృష్ణా ట్రైబ్యునల్ వాయిదా వేసింది.

Read More..

ఉమ్మడి మేనిఫెస్టోపై సంచలన నిర్ణయం.. ఏం కావాలో ప్రజలకే వదిలేసిన కూటమి

Advertisement

Next Story