Kotha Prabhakar Reddy: హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-31 09:00:18.0  )
Kotha Prabhakar Reddy:  హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇక, యశోద వైద్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పలేమన్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఐసీయూలో 5 రోజుల పాటు చికిత్స అందిస్తామన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇన్ ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయన్నారు. ఎంపీ కాన్సియస్ గా ఉన్నారని, రికవరీ ప్రాసెస్ గురించి ఆయనకు వివరించినట్లు వైద్యులు తెలిపారు. పదిహేను రోజుల తర్వాత కుట్లు తీస్తామన్నారు. ఇది మేజర్ సర్జరీ అని, రికవరీకి కొంత సమయం పడుతుందన్నారు.

Advertisement

Next Story