ముఖ్యమంత్రి కేసీఆర్‌పై Konda Surekha సీరియస్

by GSrikanth |   ( Updated:2022-12-15 11:56:40.0  )
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై Konda Surekha సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రైతులను ఉద్దరించడానికి వెళ్తున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ అన్నారు. దేశంలోనే అత్యధిక వ్యవసాయం చేసే తెలంగాణ రాష్ట్రాన్ని తన పరిపాలనలో సర్వనాశనం చేశాడని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తే అవన్ని మట్టి కొట్టుకుపోయాయని మండిపడ్డారు. గురువారం సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేసిన కొండా సురేఖ సీఎంపై విమర్శలు గుప్పించారు.

ఓ పక్క కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కాంలో మరో పక్క కుమారుడు కేటీఆర్ గ్రానైట్ దందా, కబ్జాలు, సెటిల్ మెంట్లు చేస్తుంటే మరో పక్క కేసీఆర్ దేశాన్ని ఏలడానికి ఇతర రాష్ట్రాల్లో మీటింగులు పెడతానని హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందు మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆ తర్వాత దేశంలో తిరుగుతారో లేక హిందూ మహాసముద్రంలో దూకుతారో మాకు సంబంధం లేదన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత అభద్రతా భావంతో తన తండ్రి వెంటే ఉంటోందని, రాబోయే రోజుల్లో కవితను సీఎం చేయబోతున్నాడా అనే అనుమానం తనకు కలుగుతోందన్నారు. అందువల్లే కేటీఆర్ ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్ కు వెళ్లలేదని అన్నారు. కవితను అరెస్ట్ చేస్తారనే భయంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటారని బీఆర్ఎస్ వెనుక కూడా ఏదో ఒక దురుద్దేశం ఉండే ఉంటుందని అన్నారు.

Also Read...

'తొండి ప్రభుత్వం పోవాలి.. బండి ప్రభుత్వం రావాలి'

Advertisement

Next Story

Most Viewed