Komatireddy : క్యాన్సర్ కట్టడికి ప్రభుత్వం చర్యలు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

by Ramesh N |   ( Updated:2024-10-06 08:05:30.0  )
Komatireddy : క్యాన్సర్ కట్టడికి ప్రభుత్వం చర్యలు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌ను కట్టడి చేద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్-2024ని గచ్చిబౌలి స్టేడియంలో మంత్రి కోమటి‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రన్నింగ్‌లో గెలిచిన వారికి మెడల్స్, చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రన్నింగ్ ఫర్ గ్రేస్, స్క్రీనింగ్ ఫర్ లైఫ్- అనే థీమ్‌తో క్యాన్సర్‌పై పోరాటంలో ముందస్తుగా గుర్తించడం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం వలన క్యాన్సర్ బారిన పడకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగపడతాయని మంత్రి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం సైతం డిజిటల్ హెల్త్ కార్డులను అందించడమే కాకుండా.. క్యాన్సర్ వ్యాధి కట్టడికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభదశలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాలను హరిస్తోందన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌లు చేస్తూ ప్రజలను క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు నిరుపేదల చికిత్సకు సహాయం అందించడం మంచి విషయమన్నారు. మన దేశంలో క్యాన్సర్ వ్యాధి లక్షలాది మంది పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందన్నారు. దీన్ని కట్టడి చేసేందుకు మనమంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు.

డీజే టిల్లు పాటకు మంత్రి స్టెప్పులు

అంతకు ముందు డీజే టిల్లు పాటకు నృత్యం చేసి యువతను ఉత్సహపరిచడంతో పాటు జెండా ఊపి “రన్ ఫర్ గ్రేస్ – స్క్రీనింగ్ ఫర్ లైఫ్” ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి తో పాటు వేలాదిగా యువత రన్ లో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed