- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి హాట్‌టాపిక్‌గా ' Munugode '.. కేటీఆర్‌కు రాజగోపాల్ రెడ్డి ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక సంచలనం సృష్టించింది. మునుగోడు ఉపఎన్నికల సమయంలో పోటీపోటీగా పార్టీలు ప్రచారాలు చేశాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒకరికి మించి మరొకరు సభలు నిర్వహించి హామీల వర్షం కురిపించారు. ఇక ఈ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఉపఎన్నిక సమయంలో టీఆర్ఎస్ చండూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్.. తమ పార్టీ గెలిచిన 15 రోజుల్లో చండూరు రెవెన్యూ డివిజన్, వంద పడకల ఆసుపత్రి, రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ప్రకటించి ఇప్పటికి 25 రోజులు గడిచింది. మరోవైపు, ఉపఎన్నిక ఫలితాలు వచ్చి కూడా 18 రోజులు దాటింది. దీంతో, సీఎం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 'ఎక్కడున్నారు సీఎం గారు. మీరు ఇచ్చిన హామీలు అన్నీ గాలికి కొట్టుకుపోయినట్లేనా?' అని ప్రశ్నించారు. ఇక మరోవైపు, మంత్రి కేటీఆర్ మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో 'దత్తత మాట ఎత్తట్లేదు ఏంటీ KTR గారు?' అంటూ నిలదీశారు.