Choutuppal: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక పిలుపు

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-18 15:05:00.0  )
Choutuppal: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్(Choutuppal) మండలం దండు మల్కాపురంలోని ఇండస్ట్రీయల్ పార్కులో కాలుష్య రహిత పర్యావరణహిత క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే రమణీ ఇండస్ట్రీస్‌ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ(Arekapudi Gandhi)తో కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలిథిన్ క్యారీ బ్యాగ్ వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యంగా మారాయని, కాలుష్యానికి హాని చేయకుండా ఉండే క్యారీ బ్యాగ్స్‌ను వాడాలని.. అలాంటి బ్యాగ్స్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని రూపొందించిన రమణీ ఇండస్ట్రీస్(Ramani Industries) యాజమాన్యానికి అభినందనలు చెప్పారు.

ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలు స్థాపించాలని.. అటువంటి వారికి తమ పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత సమాజంలో కాలుష్యం ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్న తీరు మనసుని కలచి వేస్తుందని ఆవేదన చెందారు. పర్యావరణహితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తమ వంతు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి(Nirmala Jaggareddy), తెలంగాణ ఇండస్ట్రీయల్ ఫెడరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి, డీఆర్డీఓ సైంటిస్ట్ వీరబ్రహ్మంలతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.



Also Read : Konda Surekha: చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహిస్తాం

Advertisement

Next Story

Most Viewed