- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావుపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ను విమర్శించడం బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని హితవు పలికారు. ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల పేరుతో కేసీఆర్ మోసగించారన్నారు. ఉపాది హామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కల్పించలేదన్నారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీష్ రావు భయపడుతన్నారన్నారు. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులకున్నా కోమటిరెడ్డి గుర్తు చేశారు. మెదక్‌లో బీఆర్ఎస్ కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరా.. అని హరీష్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫాంహౌస్‌లో నుంచి బయటకు రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కర్రపట్టుకుని కేసీఆర్ బయటకు వస్తున్నారన్నారు. సచివాలయానికి రేవంత్ రెడ్డి వచ్చిన దాంట్లో పది శాతం కూడా కేసీఆర్ రాలేదన్నారు.
మూడు నెలల్లో రేవంత్ రెడ్డి 60 సార్లు సచివాలయానికి వచ్చాన్నారు. అపాయింట్‌మెంట్లు లేకుండానే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారని.. కేసీఆర్ పాలనలో హోంమంత్రికి కూడా అపాయింట్‌మెంట్ లేదన్నారు. పార్టీ మూతపడే స్థితికి వచ్చినందున ఎక్కడికి వెళ్లాలో వారికి అర్థం కావడం లేదన్నారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు నాటకాలాడుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. రాజీనామా పత్రం ఒకటిన్న లైన్ మాత్రమే ఉండాలి.. హరీష్ రావు రాజీనామా పత్రాన్ని ఒకటిన్నర పేజీ రాశారన్నారు. టీఆర్ఎస్ వస్తే తొలి సీఎం దళితుడని నాడు కేసీఆర్ చెప్పారని.. దళితుడిని సీఎం చేయకపోతే మెడపై తల ఉండదని గొప్పలు చెప్పారన్నారు. పరిపాలన అనుభవం ఉండాలని తొలిసారి కేసీఆర్ సీఎంగా ఉండాలన్నారని.. రెండో సారి బీఆర్ఎస్ వచ్చినా.. దళితుడిని సీఎం చేయలేదన్నారు. ఇప్పటికి 40 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారన్నారు. మార్చి 1న జీరో విద్యుత్ బిల్లు వచ్చిందో లేదో తెలుసుకోవాలన్నారు. అధికారం పోగానే కేసీఆర్ పిచ్చినపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.