- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KomatiReddy Venkata Reddy : కేటీఆర్ కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Delhi Asssembly Election Results) నేడు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ ఇప్పటికే 29 సీట్లు గెలిచి మరో 19 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతుండగా.. ఆప్ 13 సీట్లు గెలిచి, మరో 9 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాగా కాంగ్రెస్ ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. అయితే ఢిల్లీ ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ను ఎద్దేవా చేస్తూ వరుస ట్వీట్లు కామెంట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్)లో సెటైరికల్ ట్విట్ చేశారు. ‘బీజేపీ (BJP)ని గెలిపించినందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కంగ్రాట్స్’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KomatiReddy Venkata Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక, తెలంగాణలో ఎలా పుంజుకున్నామో అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ సున్నా సీట్లు తెచ్చుకున్నారనే విషయం మారిచిపోవద్దని కేటీఆర్ కు సూచించారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు గులాబీ పార్టీ మూల కారణం అని పేర్కొన్నారు. ఇక కేటీఆర్ ట్వీట్ పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పందిస్తూ.. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్ కు చాలా ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. కేసుల మాఫీ కోసమే ఇదంతా అనే మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు మార్చుకున్న మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్-బీజేపీ పార్టీల బంధం విడదీయరానిదని, అది నిజమని మరోసారి కేటీఆర్ నిరూపించారని పొన్నం తెలియ జేశారు.