Kodangal: కలెక్టర్‌పై దాడి కేసులో 28 మంది అరెస్ట్.. కొండగల్‌లో ఇంటర్నెట్‌ బంద్!

by karthikeya |
Kodangal: కలెక్టర్‌పై దాడి కేసులో 28 మంది అరెస్ట్.. కొండగల్‌లో ఇంటర్నెట్‌ బంద్!
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ వ్యవహరంలో అరెస్టుల పర్వం మొదలైంది. జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అర్థరాత్రి 28 మంది గ్రామస్థులను అరెస్ట్ చేశారు. వారిని పరిగి పీఎస్‌కు తరలించినట్లు తెలుస్తోంది. దుద్యాల, బొంరాస్‌పేట, కొడంగల్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దాడి జరిగిన లగచర్ల గ్రామంలో భారీగా పోలీసులు మొహరించారు. కంపెనీ ఏర్పాటు కోసం భూ సేకరణ చేస్తున్న ప్రభుత్వం లగచర్ల గ్రామస్థుల నుంచి భూమిని సేకరించేందుకు సిద్ధమయ్యారు. అయితే గ్రామస్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారని తెలియడంతో జిల్లా కలెక్టర్ జైన్‌తోపాటు కొంతమంది అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామానికి వెళ్లగా అక్కడి ప్రజలు కొంతమంది వారిపై దాడులకు దిగారు. ఈ దాడిలో కొంత మంది అధికారులు గాయపడగా.. కలెక్టర్ సహా మిగిలిన అధికారుల వాహనాలు ధ్వంసమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed