G. Kishan Reddy : కేంద్రమంత్రి పదవికి రాజీనామాపై కిషన్ రెడ్డి క్లారిటీ

by Satheesh |   ( Updated:2023-07-05 12:02:32.0  )
G. Kishan Reddy : కేంద్రమంత్రి పదవికి రాజీనామాపై కిషన్ రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ నియమించింది. దీంతో ఆయన తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే వరకు తాను మంత్రినే అని స్పష్టం చేశారు. ఇక, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై అసంతృప్తితో ఉన్నట్లు వస్తోన్న వార్తలపై సైతం ఆయన రియాక్ట్ అయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. తనకు ఎలాంటి అలక లేదని.. అనారోగ్యం వల్లే కేబినెట్ భేటీకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు.

తనకు పార్టీనే శ్వాస అని.. పార్టీ కోసమే పని చేస్తానని అన్నారు. ఫలానా పదవి కావాలని తాను పార్టీని ఎప్పుడు అడగలేదని.. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ విజయం కోసం సమిష్టిగా పని చేస్తామన్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ వరంగల్‌కు రానున్నారని.. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ తెలంగాణకు రానున్నారు. ఇక, పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి స్టేట్ చీఫ్ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed