నిరుద్యోగ దీక్షలో సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-13 07:33:30.0  )
నిరుద్యోగ దీక్షలో సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం 1200 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారన్నారు. తెలంగాణ వచ్చినా ఇప్పటికీ యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. బీఆర్ఎస్ అధికారం చేపట్టి తొమ్మిదిన్నరేళ్లు కావస్తున్నా.. నిరుద్యోగుల పట్ల కక్ష పూరితంగానే వ్యవహరిస్తోందన్నారు.

కారు పార్టీ పాలనలో విశ్వవిద్యాలయాలు కళ తప్పాయన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు భర్తీ అవుతాయని భావించామని కానీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. సర్కారు పథకం ప్రకారం నిరుద్యోగ యువతను మోసం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ చేతకాని తనం వల్లే పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. లీకేజీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితం అంధకారంగా మారిందన్నారు. ఈ నిరసన దీక్షలో బండిసంజయ్, ఈటల, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed