- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Praja Bhavan : ప్రజా భవన్ ముందు కిడ్నీ పేషెంట్స్ శాంతియుత నిరసన..
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ముందు కిడ్నీ పేషెంట్స్ ఆందోళన చేపట్టారు. కిడ్నీ రోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరి పెన్షన్‌ను కల్పించాలని తాజాగా పేషెంట్స్ శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిడ్నీ రోగులకు మెడిసిన్‌కు అయ్యే ఖర్చు భారం అవుతోందని, ఏడాది మూడు నాలుగు సార్లు హాస్పిటల్ వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు.
కిడ్నీ రోగులపై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేసి.. ఏపీ మాదిరి తెలంగాణ ప్రభుత్వం రూ. 10 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత జనవరిలో కిడ్నీ పేషెంట్స్ ఆదుకోవాలని ప్రజా భవన్‌లో కలిసి విజ్ఞప్తి చేసిన ఇప్పటి వరకు సర్కార్ పట్టించుకోవడం లేదని కిడ్నీ పేషెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ ఇచ్చి మాకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని కిడ్నీ పేషెంట్స్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాకు అన్ని చోట్లా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.