కిడ్నాప్ యత్నం కలకలం.. ఇద్దరిని పట్టుకున్న గ్రామస్తులు

by Sathputhe Rajesh |
కిడ్నాప్ యత్నం కలకలం.. ఇద్దరిని పట్టుకున్న గ్రామస్తులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: జన్వాడ చౌరస్తా వద్ద పదిమంది సభ్యుల గ్యాంగ్ హల్చల్ చేసింది. కత్తులతో బెదిరించి ఓ వ్యక్తిని కిడ్నాప్ చెయ్యటానికి ప్రయత్నించింది. ఇది గమనించిన గ్రామస్తులు వారిని అడ్డుకుని ఇద్దరిని పట్టుకున్నారు. పదిమంది సభ్యుల గ్యాంగ్ ఆదివారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చి జన్వాడ చౌరస్తాలో ఓ వ్యక్తిని అడ్డగించారు. కత్తులు చూపించి ఆ వ్యక్తిని వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేసారు. ఇది చూసిన గ్రామస్తులు వారిని అడ్డుకుని పట్టుకునే ప్రయత్నం చేసారు. దాంతో గ్యాంగ్ సభ్యులు పారిపోయారు. అయితే వారిని వెంటాడిన గ్రామస్తులు ఇద్దరిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. వారి నుంచి పోలీసులు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరిని? ఎందుకు? కిడ్నాప్ చెయ్యాలని ప్రయత్నించారు అన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed