క్రిస్టియన్ మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి కృషి

by Sridhar Babu |
క్రిస్టియన్ మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి కృషి
X

దిశ, ఖమ్మం : క్రిస్టియన్ మైనార్టీల సర్వతో ముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చి కాంపౌండ్ లోని సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్, బిషప్ లు మంత్రికి ఆశీర్వచనాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రేమ, కరుణ, సహనం, శాంతి, త్యాగం, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని లోక రక్షకుడు యేసు ప్రభువు అందించిన మహోన్నతమైన సందేశం అందరికీ ఆదర్శమని, ఆ ప్రభువు చల్లని చూపు ప్రజల మీద ఉండాలని, అందరూ బాగుండాలని, ప్రభువు ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవలు అందించేలా శక్తినివ్వాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు, క్రిస్టియన్ మైనారిటీలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story