మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

by Sridhar Babu |
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
X

దిశ, మధిర : మహిళలు అన్ని రంగాల్లో రాణించి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అమ్మ ఫౌండేషన్ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని అన్నారు. శనివారం స్థానిక శ్రీనిధి డిగ్రీ కళాశాలలో జరుగుతున్న మధిర మహిళా స్కిల్ శక్తి ఉచిత బ్యూటీ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, మహిళలు సొంతంగా తమ కాళ్లపై తాము ఎదగాలని, ప్రతి మహిళను కోటీశ్వరులుగా చూడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కనక తార, కళాశాల చైర్మన్ వై.అనిల్ కుమార్, నెహ్రూ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లూరి రమేష్ , కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed