- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలను గెలుస్తాం : ఎంపీల జోష్యం
దిశ వేంసూర్ : వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని 10కి 10 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ అఖండ మెజారిటీతో గెలవడం, కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం తథ్యమని ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కందుకూరులో పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎడ్ల బండ లాగడం,కబడ్డీ పోటీలు జరిగాయి. పార్థసారథి రెడ్డి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఈ పోటీలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచంలోనే ప్రసిద్ధమైనవని, అరుదైన వీటి పరిరక్షణకు ఖమ్మంలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేస్తానని రవిచంద్ర అన్నారు. ఎడ్ల పందేలు,కబడ్డీ పోటీలలో విజేతలైన వారికి అతిథులు బహుమతులు ప్రదానం చేశారు.