- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితులందరికీ దళిత బంధు అమలు చేసి తీరుతాం
దిశ, వేంసూరు/ పెనుబల్లి/ సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలో దళిత సోదరులకు క్రిస్మస్ కంటే ముందే దళిత బంధు ఇచ్చి తీరుతామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేంసూరు, పెనుబల్లి మండలాలలో పల్లెవాడ, ఎర్రగుంటపాడు, బయన్నగూడెం, అగ్రవారం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గల్లీ గల్లీలో సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి మారుమూల గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా భిగించామన్నారు. అధికారంలోకి వచ్చిన
వెంటనే రైతుబంధు కింద రైతన్నకు ఎకరానికి 16 వేలు, మహిళలకు వంటగ్యాస్ 400 రూపాయలకే అందిస్తామని తెలిపారు. భూమిలేని ప్రతి పేదవాడికి కేసీఆర్ బీమా కింద ఐదు లక్షల రూపాయల బీమా కల్పిస్తామని, ఆసరా పింఛన్, దివ్యాంగుల పింఛన్ 5 వేలు అందిస్తామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా లక్ష 16 వేల రూపాయలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు, జెడ్పీటీసీ సభ్యులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.