వీరయ్యకు కేబినెట్లో బెర్తు ఖరారు..?

by Sumithra |
వీరయ్యకు కేబినెట్లో బెర్తు ఖరారు..?
X

దిశ, భద్రాచలం : భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షులు పొదేం వీరయ్యకు రేవంత్ రెడ్డి కేబినెట్లో బెర్త్ ఖరారు అయ్యునట్లు తెలిసింది. ములుగు నియోజకవర్గం నుండి రెండు సార్లు, భద్రాచలం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పొదేం ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావు పై ఓటమి చెందారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయుంచినా, వీరయ్య కాంగ్రెస్ విధేయునిగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

కేసీఆర్ 50 కోట్లు ఆఫర్ చేసినా కాంగ్రెస్ వీడలేదు. పార్టీ పట్ల వీరయ్యకు ఉన్న విధేయతను గుర్తించిన అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ హోదా కల్పించాలని భావించినట్లుగా తెలిసింది. ఎమ్మెల్సీలుగా ఉన్నవారు ఎమ్మెల్యే లుగా విజయం సాధించడంతో, రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయు. దీంతో వీరయ్యకు మార్గం సుగమం అయ్యుంది. వీరయ్యకు అధిష్టానం నుండి ఫోన్ రావడంతో సోమవారం హైదరాబాద్ వెళ్లారు.

Advertisement

Next Story