- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం : మంత్రి అజయ్
దిశ, సత్తుపల్లి : టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంను పురస్కరించుకొని నాలుగు రోజులు నుంచి గ్రామీణ క్రీడలైన కబాడీ, బండలాగుడు పోటీలను ఘనంగా నిర్వహించారు. గొర్ల ప్రభాకర్ రెడ్డి, తెలగారపు అప్పారావు, దేవాలయ కమిటీ సభ్యులు, మందపాటి వెంకట్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు క్రీడలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. వీటితోపాటు ఎడ్ల పందాలను, బండలాగుడు ప్రదర్శనను నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, వచ్చే సంవత్సరం కూడా సీఎం కేసీఆర్, కేటీఆర్, సారథ్యంలో మరలా గొప్పగా కార్యక్రమం నిర్వహించుకుందామని తెలిపారు. కాగా ఈ పోటీలకు అంతర్ రాష్ట్రాల నుంచి వివిధ కబాడీ జట్లతోపాటు, బండలాగుడు పోటీల్లో ఒంగోలు జాతి షృషరాజమలు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు విచ్చేసిన జిల్లా జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దేవాలయ కమిటీ సభ్యులకు, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి కి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ రాయల సత్యనారాయణ, ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఏఎం చైర్మన్, రాయల శేషగిరిరావు, మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, బీఆర్ఎస్ అధ్యక్షులు పాల వెంకటరెడ్డి, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, కాలిల్నే వెంకటేశ్వరరావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.