అలర్ట్: దమ్మపేటలో పెద్దపులి సంచారం

by Disha News Web Desk |
అలర్ట్: దమ్మపేటలో పెద్దపులి సంచారం
X

దిశ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని జగ్గారం గ్రామ శివారులో పెద్దపులి సంచరించినట్లు మంగళవారం ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సత్తుపల్లి మండలం బుగ్గపాడు అటవీప్రాంతం నుండి దమ్మపేట మండలంలోకి పెద్దపులి ప్రవేశించిందని, జగ్గారం గ్రామ శివారులో పెద్దపులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. పశువుల కాపర్లు ఎవరూ పశువులను మేపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. అటవీ ప్రాంతంలో ఎవరైనా ఉచ్చులు కానీ, కరెంట్ తీగలు గానీ, అమర్చితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story