ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న తుమ్మల

by samatah |
ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న తుమ్మల
X

దిశ, దమ్మపేట:దమ్మపేట మండల కేంద్రంలోని బంజారా కాలనీ వీధిలో జరుగుతున్నా ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా ముత్యాలమ్మ ఆలయంలో శనివారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న జాతర మహోత్సవాన్ని ఆయన పరిశీలించారు. సొంత మండలం కావడంతో ఆయన గ్రామస్తులతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు శాలువా తో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ దారా యుగంధర్, సొసైటీ డైరెక్టర్ చిన్న శెట్టి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్డాకుల రాజేశ్వరరావు, యార్లగడ్డ బాబు, కాసాని నాగప్రసాద్, చిన్నశెట్టి యుగంధర్, గోపి, చిట్టిబాబు, పానుగంటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed