సీపీఐ పార్టీకే పినపాక టిక్కెట్ కేటాయించాలి..

by Sumithra |   ( Updated:2023-10-20 14:47:14.0  )
సీపీఐ పార్టీకే పినపాక టిక్కెట్ కేటాయించాలి..
X

దిశ, మణుగూరు : తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే ఇచ్చుకున్నారని మణుగూరు మండల సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. శుక్రవారం మండలంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్యకర్తలు మాట్లాడుతూ అర్హత కలిగిన వారికి, అసలైన లబ్దిదారులకు ప్రభుత్వం నుండి రావాల్సిన టువంటి దళిత బంధు, బీసీ లోన్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు పార్టీలు ఫిరాయించి పార్టీ కండువా కప్పుకున్న వారికే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇండ్లలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. దళిత బంధు వచ్చిందని ఓ భవనంలో దళితులను పిలిచి మోసం చేసి ఓ రోజు మధ్యాహ్నం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని తెలిసి ఆర్బాటంగా అదే రోజు సుమారు 400 మందికి దళిత బంధు పేర్లు మంజూరయ్యాయని తెలిపి దళితులను మోసం చేశారన్నారు.

మంజూరు చేసిన దళిత బంధులో కూడా అన్యాయం జరిగిందని, ఒక్క ఇంట్లో రెండు పేర్లు కూడా వచ్చిన వారు ఉన్నారన్నారని తెలిపారు. బీసీ లోన్లు మంజూరైన పేర్లే కాకుండా వారి కార్యకర్తలకు కూడా మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలోనే బలమైన నియోజకవర్గం పినపాక నియోజకవర్గమని సీపీఐ పార్టీ ఈసారి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ అలయన్స్ పోత్తులో భాగంగా పినపాక నియోజకవర్గ టిక్కెట్ సీపీఐకే కేటాయించాలని కార్యకర్తలు ఏకాభిప్రాయంతో డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా ఊరుకునేది లేదని భవిష్యత్తులో మంచి చేసే నాయకుడినే గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోల్లోజు అయోధ్య, నియోజకవర్గ కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, మండల కార్యదర్శి జంగం మోహన్రావు, పట్టణ కార్యదర్శి దుర్గాల సుధాకర్, జిల్లా సమితి సభ్యులు సొందే కుటుంబరావు, అక్కి నరసింహారావు, ఎస్కే సర్వర్, తోట రమేష్, బీ.వీరస్వామి, జక్కుల రాజబాబు, ఎస్వీ నాయుడు, చింతల దశరథం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed