- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
దిశ,తిరుమలాయపాలెం : తమ న్యామైన డిమాండ్లను అమలు చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరాహార దీక్షల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు కమ్మకోమటి నాగేశ్వరరావు అన్నారు. స్థానిక మండల కేంద్రమైన తిరుమలాయపాలెం బస్టాండ్ సెంటర్లో మండల వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులంతా కలిసి శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్షలు ప్రారంభించారు. మంగళవారం సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఎన్నో ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులు పడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు స్కూలు పిల్లల కడుపులు నింపుతున్నారని అన్నారు. అలాంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులతోపాటు, జీవో 8 ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు,పీఆర్సీ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి సోమనపల్లి వెంకటేశ్వర్లు, తిమ్మిడి హనుమంతరావు, సీఐటీయూ మండల కార్యదర్శి వశపొంగు వీరన్న, గొడుగు ముత్తమ్మ, నాయిని పద్మ, వీరమ్మ, షేక్.జాన్వి, సుహాసిని, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.