రంగస్థల నటుడు, మూవీ, టీవీ ఆర్టిస్ట్ దూదిపాళ్ల వీరభద్రం మృతి

by Disha Web Desk 15 |
రంగస్థల నటుడు, మూవీ, టీవీ ఆర్టిస్ట్ దూదిపాళ్ల వీరభద్రం మృతి
X

దిశ, మధిర : రంగస్థలం కళాకారులు, టీవీ ఆర్టిస్ట్ , సినిమాలలో అనేక పాత్రలలో నటించిన దూదిపాళ్ల వీరభద్రం మృతి తెలంగాణ సినిమా, బుల్లితెర, నాటక రంగానికి , టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ కు తీరని లోటని ఆ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రాథోడ్ అన్నారు. మధిర పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం మృతి చెందిన వీరభద్రం పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులకు పుట్టినిల్లు అయిన మధిర ప్రాంతానికి చెందిన వ్యక్తి కొన్ని వందల స్టేజీ లపై అద్భుతమైన నాటకాలను ప్రదర్శిస్తూ , ఉద్యోగ రీత్యా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ కళా రంగం పై మక్కువతో సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా ఎదగాలని తపనతో వీరభద్రం హైదరాబాదు తరలి వచ్చారని తెలిపారు. అక్కడ ఎన్నో సినిమాలలో మరెన్నో టీవీ సీరియల్ల్లో నటిస్తూ ఎంతో మంది కొత్తవారికి నటన అవకాశాలు కల్పించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందించారన్నారు.

తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఫౌండర్ నెంబర్ గా ఉంటూ యూనియన్ అభివృద్ధికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. అదే విధంగా మా అసోసియేషన్ లో కూడా నెంబర్ షిప్ కలిగిన వ్యక్తి వీరభద్రం అని, ఏ క్యారెక్టర్ లోనైనా అలవోకగా నటిస్తూ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై మృతి చెందడం చాలా బాధాకరమని, మరో గొప్ప విషయం చెప్పాలంటే వీరభద్రం సమాజంలో ఎన్నో సేవలు చేసుకుంటూ గత ఐదు సంవత్సరాల క్రితం తన మరణ అనంతరం తన దేహాన్ని ఖమ్మం మమత మెడికల్ కళాశాలకు డొనేట్ చేస్తానని ఒప్పంద పత్రాలపై సంతకం చేశారని తెలిపారు. వీరభద్రం కోరిక మేరకు తన పార్థివదేహాన్ని ఖమ్మం మమతా మెడికల్ కళాశాలకు అప్పగించినట్లు తెలిపారు. తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ లో 1300 మంది సభ్యులు ఉన్నారని, ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి వీరభద్రం అని,

అలాంటి వ్యక్తి ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో యూనియన్ పెద్దలు ఆర్టిస్టులు వారి ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారన్నారు. తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పృథ్వీరాజ్, యూనియన్ ఆల్ కమిటీ చైర్మన్ నండూరి రాము, యూనియన్ ప్రెసిడెంట్ రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ పద్మ రేఖ, జనరల్ సెక్రటరీ నూకరాజు, కోశాధికారి ఎస్ ఆర్ ఎస్ ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ లు రామ్మోహన్, రజిని శ్రీ కళ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కేపీ రెడ్డి , పీఆర్ ఓ గోంగూర శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ నెంబర్స్, యూనియన్ లో ఉన్న సీనియర్ ఆర్టిస్టులు , సభ్యులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారని తెలిపారు.


Next Story