మద్యం మత్తులో యువకుని వీరంగం..

by Sumithra |
మద్యం మత్తులో యువకుని వీరంగం..
X

దిశ, వైరా : వైరాలోని ఓ వైన్ షాప్ సమీపంలో జాతీయ ప్రధాన రహదారి పై చిత్తుగా మద్యం సేవించిన ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. వైరాలోని మధిర క్రాస్ రోడ్డులో ఈ మందుబాబు చేసిన హల్చల్ తో రోడ్డుపైన వెళ్తున్న జనం హడలిపోయారు. మద్యం మత్తులో నలుగుగురి పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. కొణిజర్లలోని ఎస్సీ కాలనీకి చెందిన శశికుమార్ మరికొంత మంది మిత్రులతో కలిసి వైరా వచ్చి మధిర క్రాస్ రోడ్డులోని వైన్ షాప్ లో చిత్తుగా మద్యం తాగారు. ఆ తర్వాత విచక్షణ కోల్పోయిన శశికుమార్ వైరాలో వ్యాపారాలు, ఇతర పనులు చేసుకుంటున్న రాజస్థాన్ ఇతర ప్రాంతాలకు చెందిన వారిపై దాడికి పాల్పడ్డాడు.

అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వారిపై కూడా వీరంగం చేయడంతో వారందరూ మిన్నకుండిపోయారు. విషయం తెలిసిన వెంటనే వైరా పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని శశికుమార్తో పాటు అతనితో ఉన్న మరో యువకుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. జాతీయ ప్రధాన రహదారి పక్కన క్రాస్ రోడ్డు వద్ద జనరద్దీ అధికంగా ఉన్నచోట సాయంత్రం వేళ మందుబాబుల వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నారు. తరచూ మందుబాబుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed