- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీ ధ్వంసం
దిశ అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంట పాత గ్రామపంచాయతీ కార్యాలయంలోని కాంప్లెక్స్ శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో కూలుస్తుండగా పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వాళ్లు మేల్కొని బయటికి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. ఈ సంఘటనతో మొండికుంట గ్రామ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పంచాయతీ సర్పంచ్ కు పోలీసులకు సమాచారం అందజేశారు.
ఈలోగా పోలీసులకు కూడా సమాచారం వెళ్లడంతో అశ్వాపురం పోలీస్ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మొండి కుంట గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తే పంచాయతీ పాలకవర్గంలోని ఒక ప్రజాప్రతినిధి పేరు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డిని వివరణ కోరగా తొలుత నాకు కూడా తెలియదన్నారు. పంచాయతీ వారికి తెలియకుండా పాత కార్యాలయాన్ని కూల్చాల్సిన అవసరం ఎవరికి ఉందని ప్రశ్నించినప్పుడు కార్యాలయానికి నేనేమైనా కాపలా ఉన్నానా అంటూ సమాధానం ఇచ్చారు.
పంచాయతీ పాలకవర్గానికి తెలియకుండా మిషన్లో సహాయంతో గ్రామం నడిబొడ్డున ఉన్న పాత కార్యాలయం కూల్చాల్సిన అవసరం ఎవరుకుంటుందని గ్రామస్తులు పోతున్నారు. ఈ సంఘటన తెలుగులోకి వచ్చిన వెంటనే పలువురు వివిధ రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా నెగ్గు తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.