- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
తిరుమలాయపాలెం / నేలకొండపల్లి : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి అన్నారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా రెండు మండలాలకు చెందిన 37మంది లబ్ధిదారులకు రూ. 11 లక్షల 50వేలు విలువ చేసే చెక్కులను అందించారు. స్వర్ణకుమారి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారన్నారు.
పాలేరు ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి ఆదుకుంటారని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చావా శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మద్దుల పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్ గౌడ్, శాఖమూరి రమేష్, తాటికొండ కిరణ్, అశోక్, దూదిమట్ల వెంకట్, నాగరాజు, వెంకన్న, ఉన్నం రాజశేఖర్ పాల్గొన్నారు.
- Tags
- Congress