- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు
దిశ, ఇల్లందు : కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలందరికీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా రాత్రనకా, పగలనకా, శ్రమిస్తున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, సహకారం అందించిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, స్త్రీ , శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, జెడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు, బయ్యారం, గార్ల, కామేపల్లి,
టేకులపల్లి మండలాల నుండి అంచనాలకు మించి ప్రజలు హాజరైనారని,దీంతో హరిప్రియ గెలుపు ఖాయమైపోందని రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర అన్నారు. కోమరారం, బోడు గ్రామాలను మండలాలుగా మార్చాలని హరి ప్రియ కోరడంతో కేసీఆర్ స్పందించి కొత్త ప్రభుత్వం ఆరంభం లోనే వాటిని మండలాలుగా చేస్తానని మాటిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ, జెడ్పీ చైర్మన్ బిందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా, 11వ వార్డు కౌన్సిలర్ జే కే శీను, కౌన్సిలర్లు సామల మాధవి, గిన్నారపు రజిత, తోట లలితా శారద, మహిళ సంఘం నాయకురాలు ధనలక్ష్మి, మీడియా ఇంచార్జ్ గిన్నారపు రాజేష్, పట్టణ మైనారిటీ అధ్యక్షులు నబి తదితరులు పాల్గొన్నారు.