- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిందే తెలంగాణ రక్షణ సమితి: సత్యనారాయణ
దిశ, కల్లూరు: కల్లూరు మండల కేంద్రంలో హిమాలయ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా. రైతులకు, వృద్ధులకు,నిరుద్యోగులకు వికలాంగులకు, ఉద్యమకారులకు అండగా ఏర్పడింది తెలంగాణ రక్షణ సమితి పార్టీ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్‌ను లీక్ చేసి 30 లక్షల మంది నిరుద్యోగులతో వారి కుటుంబాలతో చెలగాటం ఆడిందని.బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని ఆయన అన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, సీతారామ కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతిమయ మయ్యాయని, పోడు వ్యవసాయదారులకు పట్టాలే ఇవ్వలేదని,ధరణి గందరగోళంలో ఉందని, దళిత బంధు లేదని,రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయిందని అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పటానికి ఏర్పడిందే తెలంగాణ రక్షణ సమితి అని నరాల సత్యనారాయణ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర మహిళా కార్యదర్శి కే దుర్గ,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పినపాక ఇంచార్జ్ పూనెం సీతక్క,ముస్లిం మైనారిటీ జిల్లా ఇంచార్జ్ ఎండి సలీం,మహిళా జిల్లా కార్యదర్శి సిహెచ్ పద్మ,జిల్లా ఉపాధ్యక్షురాలు చప్పిడి పద్మ మర్మం పార్వతి, తదితరులు పాల్గొన్నారు.