- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కులగణనలో దేశానికే తెలంగాణ రోల్‌మోడల్
దిశ, ఖమ్మం రూరల్ : కులగణనతో దేశానికే తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలుస్తుందని, ఎన్యుమరేటర్లు బాధ్యతాయుతంగా వివరాలు నమోదు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం రూరల్ మండలం వెంకటగిరి పంచాయతీ పరిధిలో గల కోటనారాయణపురం గ్రామంలో కులగణను ఆయన పరిశీలించారు. గ్రామంలోని షేక్ ఆశా బేగంతో మంత్రి మాట్లాడారు. వారి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గణన కొంత ఇబ్బందిగా ఉన్నా అధికారులు పూర్తిగా వివరాలు సేకరించాలని కోరారు. ఒక్కొ కుటుంబానికి 75 కాలాలతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో ఆ పథకాలను వర్తింపజేస్తామని తెలిపారు.
రాజకీయాలకతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించేందుకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన రాష్ట్రంలో జరుగుతుందన్నారు. చేసిన సర్వేను ఏ రోజుకు ఆరోజు కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తామన్నారు. ప్రతి ఎన్యుమరేటర్ 170 ఇళ్ల వరకు సర్వే చేస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడైనా కులగణన చేయాలంటే తెలంగాణ రాష్ట్రంని మోడల్ గా తీసుకోవాలన్నారు. అనంతరం ఎన్యుమరేటర్లకు సర్వే కిట్లను పంపిణీ చేశారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజ, ఆర్డీఓ నరసింహరావు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ భైరు హరినాథ్‌బాబు, కాంగ్రెస్ నాయకులు మద్ది మల్లారెడ్డి, తమ్మినేని నవీన్, కళ్లెం వెంకటరెడ్డి, కందుకూరి వెంకటనారాయణ, ఎంపీడీఓ కుమార్, తహసీల్దార్ రాంప్రసాద్, ఐబీ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఎంపీఓ రాజారావు ఉన్నారు.