- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాలుగోసారి ఎమ్మెల్యే కావడం ఖాయం : సండ్ర వెంకట వీరయ్య
దిశ, కల్లూరు: కారు గుర్తుపై ఓటు వేసి మరోసారి అక్కున చేర్చుకోవాలని.. నాలుగోసారి ఎమ్మెల్యే కావడం ఖాయమని బీఆర్ఎస్ సత్తుపల్లి అసెంబ్లీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్యసభ సభ్యులు హెట్రో సంస్థల అధినేత బండి పార్థసారథి రెడ్డి తో కలిసి విఎం బంజర్, పెనుబల్లి గ్రామాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిన పెనుబల్లి మండల ప్రజలకు ఎమ్మెల్యే సండ్ర కృతజ్ఞతలు తెలిపారు. పెనుబల్లి మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు పూర్తి చేశామని 15 ఏళ్ల క్రితం పెనుబల్లికి.. నేటి పెనుబల్లికి చేయడానికి గమనించాలని అన్నారు.
మరల అధికారం చేపట్టిన వెంటనే భూమిలేని నిరుపేదలకు రూ.5 లక్షలు కేసీఆర్ బీమా, మహిళకు రూ.3 వేలు బృతిని, రైతుబంధు రూ.16 వేలు, రూ.400 లకే గ్యాస్ సిలిండర్ ఇంకా మరెన్నో పథకాలను సీఎంగా కేసీఆర్ ప్రవేశ పెట్టబోతున్నారని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలోనే పెనుబల్లి మండలంలో అత్యధిక మెజార్టీ సాధించే విధంగా కారు గుర్తుపై ఓటు వేసి నాలుగో సారి ఎమ్మెల్యేగా, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలేఖ్యవినీల్, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, కనగాల వెంకటరావు, కోటగిరి సుధాకర్ బాబు, వంగ గిరిజాపతి, భుఖ్య ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.