- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
దిశ, ఖమ్మం కల్చరల్ : విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, శాస్త్రీయ ఆలోచనల వైపు మళ్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. గురువారం ఖమ్మం సెంట్ జోసెఫ్ స్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న దశలో ప్రజలు మూఢనమ్మకాల వైపు మొగ్గుచూపుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని పరిశీలన జ్ఞానంతో అన్వేషించాలని ఆయన సూచించారు. విద్యార్థులు రేపటి భావిశాస్త్రవేత్తలుగా ఎదిగి భారతదేశాన్ని సాంకేతిక రంగాల్లో ముందుంచాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి స్వామినేని సత్యనారాయణ మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనకు చక్కని స్పందన లభించిందని అన్నారు. ఇన్స్పైర్ , సైన్స్ ఫెయిర్ లను సంయుక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనలో విభాగాల వారీగా ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎం.శ్రీనివాస్ సెంట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపాల్ నక్షత్రం, డీఎస్ఓ బి.సైదులు, డీసీసీబీ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు.