అంబేడ్కర్ వర్సిటీ కోర్సుల్లో జాయిన్ కావాలిః రీజినల్‌ కో-ఆర్డినేటర్ వీరన్న

by Nagam Mallesh |
అంబేడ్కర్ వర్సిటీ కోర్సుల్లో జాయిన్ కావాలిః రీజినల్‌ కో-ఆర్డినేటర్ వీరన్న
X

దిశ, ఖమ్మంః డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ(యూజీ) బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో, పీజీ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, బీఎల్ఎస్ఐఎస్సీ, ఎంఎల్ఎస్సీ తదితర డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 31వ తేదీలోగా ప్రవేశాలు పొందాలని ఖమ్మం రీజినల్ కోఆర్డినేటర్ డా, వీరన్న అన్నారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి రసాయన శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ దొడ్డపునేని కోటేశ్వరరావులుత కలిసి బుధవారం స్థానిక ఎస్.ఆర్. అండ్ బిజిఎన్ఆర్ కళాశాలలోని అంబేడ్కర్ యూనివర్సిటీ ఖమ్మం ప్రాంతీయ అధ్యయన కేంద్రాన్ని డైరెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ రెగ్యులర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు చేయలేని విద్యార్థులకు, గృహిణులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనుకొనే వారందరికీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 44 సంవత్సరాలుగా అందుబాటులో వుంటు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు. యూనివర్సిటీ నాక్-ఏ గ్రేడ్ ని సాధించిందని ఆయన అన్నారు. డిగ్రీ కోర్సులు సెమిస్టర్ సిస్టంలోను, పీజీ కోర్సులు ఇయర్వైజ్ స్కీంలో నిర్వహిస్తున్నామన్నారు. www.braouonline.in; లేదా www.braou.ac.in లో వివరాలు పొందవచ్చని ఆయన అన్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని యూనివర్సిటి అసిస్టెంట్ ప్రొఫెసర్ దొడ్డపునేని కోటేశ్వరరావు తెలిపారు. పూర్తి సమాచారం, సందేహాల నివృత్తి కోసం సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని ఆయన అన్నారు. డిగ్రీ, పీజీ పూర్వవిద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో సకాలంలో ఫీజులు చెల్లించలేకపోయిన వారు 2015-16 నుంచి 2023-24 వరకు అడ్మిషన్లు పొంది ఉంటే వారు కూడా ఫీజులు చెల్లించేందుకు ఈనెల 31 వరకు గడువు ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed