- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sathupalli MLA : అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం
దిశ,సత్తుపల్లి : రాబోయే ఒక మాసంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. పెనుబల్లి,వేంసూరు మండలం పలు గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లు పండించిన ప్రతి రైతుకు కింటాకు 500 చొప్పున బోనస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 6. గ్యారంటీలు సంక్షేమ పథకాలు అందించి తీరుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఆమె తెలిపారు. రైతులందరికీ రైతు రుణమాఫీ రైతు భరోసా త్వరలో అందజేస్తామని రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజా ప్రభాకర్ చౌదరి, ఏఎంసీ వైస్ చైర్ పర్సన్ గోర్ల వెంకటప్ప రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, పెనుబల్లి, వేంసూరు మండలాల ఏవోలు, ఏటీఎం లు, పలు గ్రామాల స్థానిక రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.