- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పొంగులేటి ప్రచారం.. కాంగ్రెస్‌లోకి ముత్యాలగూడెం సర్పంచ్
దిశ, కూసుమంచి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ ప్రచార కో- కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలేరులోని పలు ప్రాంతాలలో పొంగులేటి తన ప్రచారాన్ని కొనసాగించిన అనంతరం కూసుమంచి చేరుకున్నారు. పొంగులేటి కి మహిళలు, అభిమానులు కోలాట నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని.. రైతులకు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామన్నారు.
ప్రజలంతా కాంగ్రెస్ వెంట ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన సర్పంచ్ బోలికొండ శ్రీనివాసరావు, మాజీ ఉపసర్పంచ్ కోనేటి రామారావు, కుక్క శీను తాటికొండ రాము, తాటికొండ రామారావు, పాసిని ఉపేందర్, కుక్క గణేష్, పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మద్దినేని స్వర్ణకుమారి, మండల పార్టీ అధ్యక్షుడు మట్టే గురవయ్య, కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, కనకం మైసయ్య, మాజీ ఎంపీపీలు యడవల్లి ముత్తయ్య, రామసహాయం వెంకట్ రెడ్డి, హఫీజుద్దీన్, బజ్జురి వెంకట్ రెడ్డి, ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్ది, సుధాకర్ రెడ్ది, భారీ వీరభద్రం, జొన్నలగడ్డ రవి, జూకూరి గోపాల్ రావు, కొండా మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.