కుంగిన సింగభూపాలెం చెరువు కట్ట

by Sridhar Babu |
కుంగిన సింగభూపాలెం చెరువు కట్ట
X

దిశ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలో ఉన్న సింగభూపాలెం చెరువు కట్ట స్వల్పంగా కృంగింది. ఈ విషయం సీపీఎం నాయకులు దృష్టికి పోవడంతో వారు ఆదివారం చెరువు కట్ట వద్దకు వచ్చి కృంగిన చోట పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువు కట్టకు ప్రమాదం పొంచి ఉందన్నారు. నాసిరకం నిర్మాణం చేపట్టడం వలన గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా సింగభూపాలెం ప్రాజెక్టు చెరువుకట్ట కృంగిందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణానికి 2016లో గత ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ప్రాజెక్టు దగ్గర ప్రొటెక్షన్ వాల్ సరిగ్గా నిర్మించలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం నాసిరకం లేకుండా పటిష్ట నిర్మాణం చేయాలని సీపీఎం నాయకత్వంలో గత అనేకసార్లు అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఫలితంగా సింగభూపాలెం ప్రాజెక్టు చెరువు కట్ట కృంగిందని తెలిపారు.

కృంగిన చోట గండి ఏర్పడితే ప్రాజెక్టులో ఉన్న నీళ్లని బయటకు వరదలు వచ్చి వేపల గడ్డ, నరసింహసాగరు, బృందావనం బాబు క్యాంప్ గ్రామాలు జల సమాధి అయ్యే అవకాశం ఉందని తక్షణమే అధికారులు స్పందించి కుంగిన చోట మరమ్మతులు నిర్వహించి పటిష్ట నిర్మాణం చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్, నర్రా శివరామకృష్ణ, కాట్రాల తిరుపతిరావు, కొండె కృష్ణ, నల్లగోపు పుల్లయ్య, బచ్చలకూర శ్రీనివాసరావు, ఉడుగుల శ్రీకాంత్, చల్లా ఏడుకొండలు, సీపీఎం సీనియర్ నాయకులు చింతాల శ్రీను, సట్టు తిరుపాలు, వీర్ల ముత్తయ్య కుంచం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed