- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెత్తకుప్పల్లో ఆర్టీసీ ఆస్తులు.. నిరుపయోగ స్థలం పై కబ్జాదారుల కన్ను
దిశ, కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ సంస్థకు చెందిన కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు చెత్తకుప్పల్లో మూలుగుతున్న పరిస్థితి నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ ఆస్తులు నిరుపయోగంగా ఉండడం మూలంగా కేవలం చెత్త వేసుకునేందుకు ఉపయోగపడడం దారుణం. గతంలో ఇక్కడి స్థలంలో ఆర్టీసీ కార్మికులకు చెందిన గృహాలు డిపో ఉండేది. అయితే గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని కూల్చివేసిన తర్వాత సంవత్సరాల తరబడి ఖాళీ స్థలం అలాగే ఉండిపోయింది. అక్కడున్న డిపోను సైతం ఆర్టీసీ బస్టాండ్ పక్కకు మార్చడం జరిగింది. దీంతో ఇక్కడి కాళీ స్థల ప్రాంతం పాత బస్ డిపో ఏరియాగా ముద్ర పడిపోయింది.
ఈ తతంగమంతా జరిగి ఏండ్లు గడుస్తున్న ఖాళీ స్థలాన్ని మాత్రం ఆర్టీసీ యాజమాన్యం ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా వదిలేసినట్లుగా సమీపంలో ఉన్న కొంతమంది ఆరోపించడం గమనార్హం. సంవత్సరానికి ఒకసారి మాత్రం ఖాళీ స్థలాన్ని ఎగ్జిబిషన్ నిర్వాహకులకు యాజమాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జిబిషన్ సీజన్ అయిపోయిన తర్వాత స్థలం నెలల తరబడి నిరుపయోగంగా ఉండడం మూలంగా ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరగడంతో పాటు కొందరు చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల పందులు కుక్కలు సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఆర్టీసీ యాజమాన్యం పూర్తిస్థాయిలో ఎందుకు వినియోగించుకోలేకపోతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆదాయ వనరులను ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకుంటే సంస్థకు ఆదాయం రావడంతో పాటు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని పలువురు సూచిస్తున్నారు.
ఆర్టీసీ ఖాళీ స్థలం పై కబ్జాదారుల కన్ను....
ఇటు శ్రీనగర్ గ్రామపంచాయతీకి అటు మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్న ఆర్టీసీ పాత బస్ డిపో ఆస్తులు కొన్ని సంవత్సరాల తరబడి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కారణంగా ఈ స్థలాల పై కబ్జాదారుల కన్ను పడింది. ఇప్పటికే కొంత స్థలం కబ్జాకు గురైనట్లు కూడా ఆరోపణలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్థలాలను నిరుపయోగంగా వదిలేయకుండా అందులో షాపింగ్ కాంప్లెక్స్ లేదా ఆర్టీసీ ఏకో పార్కును ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంత ఉపయోగంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
పాత బస్ డిపో స్థలాన్ని కళ్యాణ మండపం గా మార్చాలి : 23వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి..
ఇటు మునిసిపాలిటీకి అటు శ్రీనగర్ గ్రామపంచాయతీకి అనుకొని ఉన్న పాత బస్ డిపో ఖాళీ స్థలాన్ని కళ్యాణ మండపం గా మార్చాలి. ఖాళీ స్థలం నిరుపయోగంగా ఉండడం వల్ల ఆర్టీసీ సంస్థకు నష్టం తప్ప లాభం లేదు. కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంతో అభివృద్ధికి ఖర్చు చేసుకోవచ్చు. ఆ దిశగా యాజమాన్యం ఆలోచించి చర్యలు తీసుకోవాలి.
ఖాళీ స్థలాన్ని ఎగ్జిబిషన్ వారికి ఇవ్వడం జరిగింది: డిపో మేనేజర్ దేవేందర్..
పాత బస్ డిపో ఖాళీ స్థలాన్ని ఎగ్జిబిషన్ వారికి లీజుకు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ స్థలంలో ఉన్న బిల్డింగ్ ను సైతం ఒక స్కూల్ యాజమాన్యానికి అద్దెకు ఇచ్చాము. ఇరువురు అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ ఉపయోగించుకునేందుకు ముందుకు రాలేదు. ఆర్టీసీ ఖాళీ స్థలాలను ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.