'Disha Effect': అన్నంలో పురుగులు, కూరల్లో వెంట్రుకలు' కథనానికి స్పందన

by Kalyani |
Disha Effect: అన్నంలో పురుగులు, కూరల్లో వెంట్రుకలు కథనానికి స్పందన
X

దిశ, కొత్తగూడెం : ఎస్సీ బాలికల వసతి గృహంలో 'అన్నంలో పురుగులు, కూరల్లో వెంట్రుకలు' అనే శీర్షికను దిశ పత్రిక ప్రచురించింది. ఈ అంశంపై ఇంటెలిజెన్స్ ఆరా తీయడం మొదలు పెట్టింది. సోమవారం ఉదయం కొత్తగూడెం ఎస్సీ బాలికల పోస్టుమెట్రిక్ వసతి గృహానికి ఇంటెలిజెన్స్ అధికారులు చేరుకుని వార్డెన్ ని, సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. హాస్టల్ లో ఉన్న బియ్యం,కూరగాయలు, ఇతర సామాగ్రి నాణ్యతను పరిశీలించారు. ఈ అంశంపై నివేదికను ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ అంశాన్ని పక్క దారి పట్టించేందుకు, అధికారులు విద్యార్థినుల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సమాచారం బయట వారికి అందిస్తున్నారని, అనుమానంతో ఒక విద్యార్థినిని లగేజ్ సర్దుకొని వెళ్లిపోవాలని సిబ్బంది, అధికారులు వేధిస్తున్నట్లు సమాచారం. ఒకరిని బెదిరిస్తే మిగతా వారంతా భయపడి విచారణ సమయంలో నోరు మెదపరనే ఆలోచనతో ఇలా చేస్తున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేస్తున్నారు.

Next Story

Most Viewed