- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
‘మిస్టర్ సెలెబ్రిటీ’ నుంచి ‘నీ జతగా’.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్
దిశ, సినిమా: సుదర్శన్ పరుచూరి హీరోగా రాబోతున్న సినిమా ‘మిస్టర్ సెలెబ్రిటీ’. ఆర్పి సినిమాస్ బ్యానర్‌పై చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పోస్టర్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే జోష్‌లో ‘మిస్టర్ సెలెబ్రిటీ’ నుంచి ఓ మెలోడీ పాటను మాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు.
‘నీ జతగా’ అంటూ సాగే ఈ మెలోడీ పాటను గణేశా రచించగా.. జావెద్ అలీ ఆలపించారు. ఇక ఈ పాటను రిలిజ్ చేసిన అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ.. ‘పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను చూశాను. చాలా బాగుంది. ఇప్పుడు పాటను రిలీజ్ చేశాను. అది కూడా చాలా బాగుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఇక త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది ‘మిస్టర్ సెలెబ్రిటీ’.