- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దారి కోసం నేషనల్ హైవే పై డివైడర్ తొలగింపు..
దిశ, వైరా : నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ భవనానికి దారి కోసం ఏకంగా జాతీయ రహదారి పై ఉన్న డివైడర్ ని తొలగించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినప్పటికీ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు నిద్ర మత్తును నటిస్తున్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలే నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించి ఆపై ఏకంగా దారి కోసం జాతీయ రహదారి పై డివైడర్ ను కూల్చి వేశారు. వైరాలోని తహశీల్దార్ కార్యాలయం సాక్షిగా ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే వైరాలోని తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా తనకున్న సుమారు 132.4 చదరపు గజాల ఖాళీ స్థలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించారు. అయితే రెసిడెన్షియల్ అనుమతులతో 3 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించటంతో మున్సిపాలిటీ ఆదాయానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది.
అంతే కాకుండా కనీస పార్కింగ్ సౌకర్యం లేకుండా నిర్మించిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ భవనాలను దర్జాగా అద్దెకిచ్చారు. ఈ విషయమై దిశ దిన పత్రికలో అనేక వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు కనీస చర్యలు తీసుకోకుండా పూర్తిస్థాయిలో సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సదరు భవన యజమాని తహశీల్దార్ కార్యాలయం వైపు నుంచి తన షాపింగ్ కాంప్లెక్స్ కు నేరుగా జనం వచ్చేందుకు డివైడర్ ను తొలగించారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మహిళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం తీవ్ర చర్చనీయాంశమైంది. అయినప్పటికీ ప్రభుత్వంలోని పలు శాఖల అధికారులు తమకేమీ తెలియదనట్లు వ్యవహరించటం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ విషయమై వైరా టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కర్ ను వివరణ కోరగా డివైడర్ ను తొలగించిన విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని స్పష్టం చేశారు.