- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దిశ' కథనంపై స్పందన... బాలికల హాస్టల్ ను తనిఖీ చేసిన కలెక్టర్
దిశ, కొత్తగూడెం : ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు పడుతున్న అవస్థలపై సోమవారం దిశ పత్రికలో ' అన్నంలో పురుగులు, కూరల్లో వెంట్రుకలు' శీర్షిక ప్రచురితమైంది. ఈ వార్తకి స్పందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం ఉదయం ఎస్సీ పోస్ట్ మెట్రిక్ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థినులతో మాట్లాడి, భోజనం నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం,శుద్ధ జలం అందించాలని వార్డెన్ సునీతకు సూచించారు. వసతి గృహ నిర్వహణపై వార్డెన్ సునీతకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి డి.అనసూర్య, కొత్తగూడెం ఏ.ఎస్ సి. డబ్ల్యూ. ఓ సునీత, సూపరిండెంట్ హనుమంతరావు, జూనియర్ అసిస్టెంట్ పార్వతి షెడ్యూల్ కులములు అభివృద్ధి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.