అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : ఎమ్మెల్యే కూనంనేని

by Aamani |
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : ఎమ్మెల్యే కూనంనేని
X

దిశ, కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే ఉపేక్షించేది లేదని ఎలాంటి లోపాలున్నా అధికారులు బాధ్యత వహించాల్సివుంటుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. చుంచుపల్లి మండలపరిధిలోని విద్యానగర్ కాలనీలో రూ.67 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ డిఎంఎఫ్టీ, ఎస్డీఎఫ్, ఎన్ఆర్జీఎస్ తదితర పథకాల కింద విడుదలైన నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనుల శరవేగంగా కొనసాగుతున్నాయని ఇప్పటికే డెబ్భై శాతం మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు.

మిగిలి ఉన్న రోడ్లు, డ్రైనేజీలకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. విద్యానగర్ పరిధిలోని చింతల చెరువు అభివృద్ధికి రూ.కోటి మంజూరయ్యాయని పనులు పూర్తయితే ముంపు సమస్య తిరుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపిడివో అశోక్ కుమార్, డీఈ సత్యనారాయణ, ఏఈ నాగేందర్, మతిన్, స్థానికులు చీకటి కార్తిక్, మాధవరావు, కృష్ణమూర్తి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్, ప్రసాద్, రామకృష్ణ, రవి, బాబు, కృష్ణ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed