- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : పొంగులేటి
దిశ, టేకులపల్లి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం టేకులపల్లి మండలంలో పర్యటించారు. 8.26 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సీఎస్ఆర్ నిధులు రూ. 90 లక్షలతో ఎర్రాయి గూడెం- చింతల కట్ట బీటీ రోడ్డు, ఆర్ అండ్ బి నిధులు రూ.2.40 కోట్లతో దాసు తొండ - ఎర్రబోడు, రూ 1.94 కోట్లతో సింగ్యా తండా -శాంతినగర్ బీటీ రోడ్డుకు, అదేవిధంగా ఐటీడీఏ ఎస్ టి ఎస్ డీఎఫ్ నిధులు రూ.3.22 కోట్లతో ఒడ్డుగూడెం వయా బర్ల గూడెం టు జంగాలపల్లి వరకు, రూ.1.42 కోట్లతో సంపత్ నగర్ - పెద్ద చర్లపల్లి బీటీ రోడ్డు , రూ.1.30 కోట్లతో సంపత్ నగర్ - ఉలవ చలక బీటీ రోడ్డు పనులకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత పాటించాలని తెలిపారు.
టేకులపల్లి మండలం గంగారం గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన బాలుర వసుతి గృహాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ తనిఖీలో భాగంగా మంత్రి వసతి గృహంలో వంటశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పిస్తున్నారా లేదా అని అడిగారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హెడ్మాస్టర్ ని ఆదేశించారు. వసతి గృహంలో పరిశుభ్రత పాటించాలన్నారు విద్యార్థులకు బెడ్లు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పెగళ్ళపాడు వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలోనే ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపడతామని అన్నారు. 6 గ్యారంటీలతో రైతు భరోసా కూడా సంక్రాంతి పండుగ తర్వాత ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని తెలిపారు.
అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహిళలతో మాట్లాడారు. ఇల్లందు శాసనసభ్యులు కనకయ్య సతీమణి కోరం లక్ష్మి ని వారి నివాసంలో కలిసి పరామర్శించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు, బోడు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు, మాజీ ఎంపీపీ బానోత్ మౌనిక వినతి పత్రం అందజేశారు, సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు, పలువురు నాయకులు వినతి పత్రలు అందజేశారు. స్వీకరించిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా టేకులపల్లి తాసిల్దార్ నాగ భవానిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐటిడి ఏపీఓ రాహుల్, ఆర్ అండ్ బి, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కొత్తగూడెం ఆర్డిఓ మధు, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లెనినా, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్, నలిని,పంచాయతీరాజ్, ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవో రవీందర్రావు, తాసిల్దార్ నాగ భవాని, ఎంపీ ఓ గణేష్ గాంధీ, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్, ఏలూరి కోటేశ్వరరావు, బండ్ల రజిని, మాజీ ఎంపీపీ బాణోత్ మౌనిక,ఇస్లావత్ రెడ్యా నాయక్, ఇది గణేష్, చందర్ సింగ్ రాథోడ్, సర్దార్,రవి,భూక్యా దాల్సింగ్ నాయక్, సుదీప్, సంజయ్, శివాజీ, సాయి, నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.